గురువారం 28 జనవరి 2021
Business - Oct 22, 2020 , 01:25:59

కోలుకునే దశకు చేరాం రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్య

కోలుకునే దశకు చేరాం రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఓవైపు మాంద్యం, మరోవైపు కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన దేశం ఇప్పుడు దేశం ఆర్థికంగా తిరిగి కోలుకునే దశకు చేరుకున్నదని రిజర్వు బ్యాంకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ రచించిన ‘పోర్ట్రెయిట్స్‌ ఆఫ్‌ పవర్‌: హాఫ్‌ ఏ సెంచరీ ఆఫ్‌ బీయింగ్‌ ఎట్‌ రింగ్‌సైడ్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ.. మనం కోలుకునే దశకు చేరుకున్నామని, ఇలాంటి తరుణంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్థిక సంస్థల వద్ద తగినంత మూలధనం ఉండేలా చూసుకోవడం ఎంతో కీలకమని అన్నారు.

మరిన్ని ఉద్దీపనలకు ప్రభుత్వం రెడీ..

కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగంగా మరిన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. 


logo