శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 23, 2020 , 16:41:36

భార‌త్‌కు 8000 కోట్ల జ‌రిమానా విధించిన అంత‌ర్జాతీయ కోర్టు

భార‌త్‌కు 8000 కోట్ల జ‌రిమానా విధించిన అంత‌ర్జాతీయ కోర్టు

హైద‌రాబాద్‌:   బ్రిట‌న్‌కు చెందిన కెయిన్ ఇంధ‌న సంస్థ కేసులో హేగ్‌లోని అంత‌ర్జాతీయ కోర్టు భార‌త్‌పై 8 వేల కోట్ల‌ భారీ న‌ష్ట‌ప‌రిహారాన్ని విధించింది. ప‌న్ను వివాదం కేసులో ఆ మొత్తాన్ని చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. ప‌న్ను వివాదం కేసుల్లో అంత‌ర్జాతీయ కోర్టులో భార‌త్ ఇటీవ‌ల ఓ కేసును కోల్పోవ‌డం ఇది రెండవ సారి. ఇటీవ‌లే వోడాఫోన్ కంపెనీ ప‌న్ను వివాదం కేసును కూడా భార‌త్  కోల్పోయిన విష‌యం తెలిసిందే.  బ్రిట‌న్‌, భార‌త్ మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక పెట్ట‌బుడ‌ల ర‌క్ష‌ణ ఒప్పందాన్ని భార‌త్ ఉల్లంఘించిన‌ట్లు హేగ్ కోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది.  అయితే దీనిపై అప్పీల్ చేసుకునే అవ‌కాశాన్ని కోర్టు క‌ల్పించింది. కెయిన్ సంస్థ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా భార‌త్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు కోర్టు ఆరోపించింది. కెయిన్ ట్యాక్స్ వివాదం కేవ‌లం ప‌న్ను వివాదం మాత్ర‌మే కాదు అని, అది ప‌న్ను పెట్టుబ‌డికి సంబంధించిన వివాదం అని కోర్టు చెప్పింది.  అందుకే ఆ కేసు త‌మ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని హేగ్ కోర్టు వెల్ల‌డించింది.  

VIDEOS

logo