బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 11, 2020 , 23:37:04

విదేశాల్లో పెరుగుతున్న భారత పెట్టుబడులు

విదేశాల్లో పెరుగుతున్న భారత పెట్టుబడులు
  • జనవరిలో 40 శాతం వృద్ధితో 2.10 బిలియన్‌ డాలర్లుగా నమోదు

ముంబై, ఫిబ్రవరి 11: భారతీయ సంస్థలు.. విదేశీ పెట్టుబడులకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. దేశీయ కంపెనీలు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు గత నెలలో దాదాపు 40 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే జనవరిలో 2.10 బిలియన్‌ డాలర్లుగా నమోదైయ్యాయి. గతేడాది జనవరిలో ఈ పెట్టుబడులు 1.47 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. నిరుడు డిసెంబర్‌లో దేశీయ సంస్థలు విదేశాల్లో 1.99 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తమ ‘ఔట్‌వర్డ్‌ ఫారిన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఓఎఫ్‌డీఐ)’లో స్పష్టం చేసింది. 


ఈ ఏడాది జనవరి పెట్టుబడుల్లో 793.82 మిలియన్‌ డాలర్లు ఈక్విటీల రూపంలో, 368.55 మిలియన్‌ డాలర్లు రుణాల రూపంలో, 890.75 మిలియన్‌ డాలర్లు పూచీకత్తుల జారీ ద్వారా జరిగాయి. అత్యధికంగా పెట్టుబడి పెట్టిన సంస్థల్లో భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ అగ్రస్థానంలో ఉండగా, ఈ సంస్థ పెట్టుబడులు 247.5 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మారిషస్‌కు ఈ పెట్టుబడులు వెళ్లాయి. సెరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 226.07 మిలియన్‌ డాలర్లు నెదర్లాండ్స్‌లో పెట్టింది. బెల్జియంలో ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ 88.08 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టింది.


logo
>>>>>>