సోమవారం 01 జూన్ 2020
Business - May 12, 2020 , 00:17:50

లాక్‌డౌన్‌ పెరిగితే ఆర్థిక ఆత్మహత్యలే

లాక్‌డౌన్‌ పెరిగితే ఆర్థిక ఆత్మహత్యలే

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ ఎక్కువ రోజులు కొనసాగితే ఆర్థిక ఆత్మహత్యలు తప్పవని  మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోమవారం అన్నారు. లక్షలాది మందిని లాక్‌డౌన్‌ కాపాడుతున్నప్పటికీ దాన్ని మరింతగా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ట్వీట్‌ చేశారు. కరోనా మరణాల్లో ప్రపంచ సగటు 35గా ఉంటే, భారత్‌లో 1.4గానే ఉందన్న ఆయన.. లాక్‌డౌన్‌ను ఇంకా పెంచితే చాలామంది దారిద్య్రంలోకి వెళ్లవచ్చని హెచ్చరించారు.


logo