గురువారం 04 జూన్ 2020
Business - Apr 26, 2020 , 23:28:28

హైదరాబాద్‌లో పెరిగిన ఇండ్ల ధరలు

హైదరాబాద్‌లో పెరిగిన ఇండ్ల ధరలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: గతేడాది కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది నగరాల్లో ఇండ్ల ధరలు తొమ్మిది శాతం వరకు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.  డిమాండ్‌ పడిపోతున్న ప్రస్తుత తరుణంలో ధరలు పెరుగడం విశేషమని ప్రాప్‌టైగర్‌ నివేదికలో తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలలపాటు ధరలు ఆశించిన స్థాయిలో పెరిగినప్పటికీ..జనవరి-మార్చి మధ్యకాలంలో తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో గరిష్ఠంగా 9 శాతం వరకు పెరుగడంతో ఒక్కో చదరపు అడుగు రూ. 5,434కి చేరుకున్నది. అలాగే అహ్మదాబాద్‌లో ఆరు శాతం అధికమవగా, పుణెలో నాలుగు శాతం, బెంగళూరు, కోల్‌కతాల్లో 3 శాతం, ముంబై మెట్రోపాలిటన్‌లో 2 శాతం, నోయిడాలో ఒక్కశాతం చొప్పున పెరిగాయి. గతేడాది చివరి త్రైమాసికంలో గృహాల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 26 శాతం తగ్గి 69,135 యూనిట్లకు పడిపోయాయి. 


logo