గురువారం 01 అక్టోబర్ 2020
Business - Aug 15, 2020 , 02:00:21

మళ్లీ పెరిగిన పసిడి

మళ్లీ పెరిగిన పసిడి

న్యూఢిల్లీ: వరుసగా మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.730 పెరిగి రూ.53,690కి చేరుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్లనే ధరలు పెరిగాయి. పసిడితోపాటు వెండి కూడా మరో రూ.1,500 అందుకొని రూ.70,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా ధరలు పెరుగడం గమనార్హం. 


logo