మంగళవారం 26 మే 2020
Business - Apr 23, 2020 , 12:23:07

మ‌ళ్లీ పుంజుకున్నప‌సిడి ధ‌ర‌లు, త‌గ్గిన వెండి ధ‌ర‌

మ‌ళ్లీ పుంజుకున్నప‌సిడి ధ‌ర‌లు, త‌గ్గిన వెండి ధ‌ర‌

ప‌సిడి ధ‌ర మ‌ళ్లీ పుంజుకుంది. గత రెండు రోజులు స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఇవాళ‌ బంగారం ధరలు  పుంజుకోగా, వెండి ధరలు మాత్రం త‌గ్గాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.680 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,780కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,050కి  చేరింది. అయితే  బంగారం ధరలు కాస్తా పెరిగినప్ప‌టికి వెండి ధరలు మళ్లీ పతనమయ్యాయి. 1కేజీ వెండిపై రూ.240 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.41,410కి పడిపోయింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోందిlogo