e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News ఈ-వాలెట్ లేదా యూపీఐ లావాదేవీల‌పై ఐటీ.. డిటైల్స్ ఇవీ..

ఈ-వాలెట్ లేదా యూపీఐ లావాదేవీల‌పై ఐటీ.. డిటైల్స్ ఇవీ..

ఈ-వాలెట్ లేదా యూపీఐ లావాదేవీల‌పై ఐటీ.. డిటైల్స్ ఇవీ..

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హమ్మారి.. అంత‌కుముందు నోట్ల ర‌ద్దుతో ఈ-వాలెట్ ట్రాన్సాక్ష‌న్లు, యూపీఐ లావాదేవీలు కొన్నినెల‌లుగా ప‌లు రెట్లు పుంజుకున్నాయి. ఏదేనీ బ్యాంక్ ఏటీఎం నుంచి విత్ డ్రాయ‌ల్ చేసుకోవాల‌న్నా, బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్ష‌న్ లిమిట్‌, విత్ డ్రాయ‌ల్ చార్జెస్ వ‌ర్తింప‌జేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌లు డిజిట‌ల్ వాలెట్‌, యూపీఐ ట్రాన్స్‌ఫ‌ర్ విధానాల వైపు మొగ్గుతున్నారు.

డిజిట‌ల్ వాలెట్‌, యూపీఐ లావాదేవీలు సుల‌భంగా ఉన్నా.. వాటితో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. అవేమిటో తెలుసుకుందాం..

ఆదాయం ప‌న్ను చ‌ట్టం నిబంధ‌న‌ల ప్ర‌కారం వేత‌న ఆదాయం, ఇత‌ర మార్గాల్లో ఆదాయం, పెట్టుబ‌డి లాభాల వివ‌రాల‌ను ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్న్స్ (ఐటీఆర్‌) ఫైలింగ్‌లో త‌ప్ప‌నిస‌రి వెల్ల‌డించాలి.

యూపీఐ లేదా ఈ-వాలెట్ల ద్వారా నిధులు అందుకున్నా.. ఆదాయం ప‌న్ను నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. యూపీఐ లేదా ఈ-వాలెట్ల లావాదేవీల‌పైనా ప‌న్ను వ‌సూళ్లు జ‌రుగుతాయి. ఈ రూట్ల‌లో నిధుల మార్పిడి కూడా ప‌న్ను కింద‌కు వ‌స్తుంది.

క్యాష్‌బ్యాక్ రివార్డుల‌ను పొంద‌డానికి చాలా మంది న‌గ‌దు చెల్లింపులు గానీ చేయ‌రు. ఈ-వాలెట్లు లేదా యూపీఐ ద్వారా చెల్లిస్తారు. దీనివ‌ల్ల మీకు వ‌చ్చే క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ నిధులు నేరుగా మీ ఖాతాలో జ‌మ అవుతాయి.

ఐటీ చ‌ట్టం 56 (2) సెక్ష‌న్ ప్ర‌కారం ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50వేల‌కు పైగా క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల మేర‌కు ల‌బ్ధి పొందితే.. ఆ మొత్తంపై ప‌న్ను విధిస్తారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్ ఫేజ్ లేదా యూపీఐ మీకు రియ‌ల్ టైం మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి , ఏ స‌మ‌యంలోనైనా పొందేందుకు వీలుగా ఉంటుంది.

మనీ చెల్లించ‌డానికి, సేక‌రించ‌డానికి, ఉచితంగా ప‌లు బ్యాంకు ఖాతాల్లో నిల్వ‌లు జ‌మ చేయ‌డానికి వీలుగా యూపీఐ ఖాతా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా మ్యూచువ‌ల్ ఫండ్స్ మీద వ‌చ్చే ఆదాయంపైనా ప‌న్ను విధించిన‌ట్లే యూపీఐ లావాదేవీల‌పైనా ఆదాయంప‌న్నువ‌సూలు చేస్తారు.

యూపీఐ ద్వారా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కూ బ‌దిలీ చేయొచ్చు. ఒక‌వేళ ఈ ప‌రిమితి దాటితే ప‌న్ను చెల్లించాల్సిందే. యాజ‌మాన్యాలు ఇచ్చే గిఫ్ట్ ఓచ‌ర్ రూ.5000 దాటితే ఐటీ చ‌ట్టం 3 (7) (4) సెక్ష‌న్ కింద ప‌న్ను చార్జీ చేస్తారు. కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితుల నుంచి వ‌చ్చే ఓచ‌ర్ల విలువ రూ.50 వేలు దాటినా ప‌న్ను వ‌సూల‌వుతుంది.

ఇవి కూడా చదవండి..

పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది

57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!

త్వరలో కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే

ప్రిన్సిపాల్‌ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య

నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్‌ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్‌ మాండవీయ

కరోనా నివారణకు 8 మార్గాలు

రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్‌

పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
ఈ-వాలెట్ లేదా యూపీఐ లావాదేవీల‌పై ఐటీ.. డిటైల్స్ ఇవీ..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement