ఐటీఆర్ గడువు పొడిగింపు

- 2019-20కిగాను డిసెంబర్ 31దాకా పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వ్యక్తిగత ట్యాక్స్పేయర్లు రిటర్నులు దాఖలు చేయడానికి ఉన్న గడువును శనివారం మరోసారి పొడిగించింది. ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ చివరి తేదీని నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31కి పెంచుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలియజేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో జూలై 31 నుంచి నవంబర్ 30కి ఇంతకుముందు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఐటీఆర్ దాఖలు చేసేవారి ఖాతాల ఆడిటింగ్ గడువునూ అక్టోబర్ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించారు.
జీఎస్టీ వార్షిక రిటర్నుల గడువు పెంపు
2018-19కిగాను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక రిటర్నుల దాఖలుకున్న గడువును కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. రెండు నెలలు పొడిగిస్తూ డిసెంబర్ 31గా నిర్ణయించింది. సెప్టెంబర్లో ఈ నెల 31దాకా గడువును పొడిగించిన సంగతి విదితమే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్, ఇతర ఆంక్షల దృష్ట్యా వార్షిక రిటర్న్ (ఫామ్ జీఎస్టీఆర్-9) దాఖలు, రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ (ఫామ్ జీఎస్టీఆర్-9సీ) గడువులను పొడిగించాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) తెలిపింది.
తాజావార్తలు
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత