గురువారం 13 ఆగస్టు 2020
Business - Aug 03, 2020 , 00:11:23

ఆఖరి నిమిషందాకా ఆగవద్దు

ఆఖరి నిమిషందాకా ఆగవద్దు

  • ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేయండి

ఆదాయం పన్ను (ఐటీ) శాఖ మరోసారి 2018-19 ఆర్థిక సంవత్సరానికి (2019-20 మదింపు సంవత్సరం) పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. ఈ దఫా సెప్టెంబర్‌ 30 వరకు సమయమిచ్చింది. కరోనా వైరస్‌ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం పొడిగించారు. అయితే ట్యాక్స్‌ రిటర్నుల దాఖలుకు ఆఖరి నిమిషందాకా ఆగవద్దు. గడువు దాటితే అనేక రకాల సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పన్ను పరిధిలోకి వచ్చేవారు, ట్యాక్స్‌ రిఫండ్స్‌ క్లయిమ్‌ చేసుకునేవారికి త్వరగా పన్ను రిటర్నులను దాఖలు చేయాలని సూచిస్తున్నారు.

పెనాల్టీలు-వడ్డీ

గడువు దాటిన తర్వాత ట్యాక్స్‌ రిటర్నులను దాఖలు చేస్తే రకరకాల జరిమానాలు పడే వీలున్నది. రూ.5వేల నుంచి 10వేలు చెల్లించాల్సి వస్తుంది. ఇక మీరు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపుదారుల పరిధిలో ఉంటే.. రిటర్నుల ఆలస్యానికి పెనాల్టీలపై వడ్డీ భారం కూడా మోయాలి. ‘పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించినంత మాత్రాన ఆలస్య రుసుములు, వడ్డీల నుంచి కూడా మినహాయింపు ఉంటుందని అనుకోవద్దు’ అని ఆడిటింగ్‌ సంస్థ ట్యాక్స్‌మన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌ వాధ్వా అన్నారు. 

రిఫండ్స్‌లో ఆలస్యం

ట్యాక్స్‌ రిటర్నుల దాఖలుకు మీరు చివరి నిమిషందాకా ఆగితే.. ఆ తర్వాత రిఫండ్స్‌ ఆలస్యం అవుతాయి. సాధారణంగా రిటర్నుల ప్రక్రియ ముగిసిన తర్వాత రిఫండ్స్‌ ప్రక్రియకు నెల రోజుల సమయం పడుతుంది. అలాగే రిటర్నులు దాఖలు చేసిన నాటి నుంచి రిఫండ్స్‌పై ఐటీ శాఖ మీకు వడ్డీ చెల్లిస్తుంది. కాబట్టి ఆలస్యం చేసినకొద్దీ ఈ వడ్డీ కోల్పోవాల్సి వస్తుంది.logo