శనివారం 30 మే 2020
Business - May 04, 2020 , 02:39:36

ఆ మెయిల్స్‌తో భద్రం

ఆ మెయిల్స్‌తో భద్రం

ఐటీ విభాగం హెచ్చరిక

న్యూఢిల్లీ, మే 3: పన్ను రిఫండ్ల పేరిట ఎరవేస్తూ వచ్చే మోసపూరిత ఈ-మెయిళ్ల పట్ల పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయపన్ను (ఐటీ) విభాగం హెచ్చరించింది. ‘పన్ను చెల్లింపుదార్లు అప్రమత్తంగా ఉండాలి. పన్ను రిఫండ్లను ఆశచూపుతూ వచ్చే ఎలాంటి నకిలీ లింకులను క్లిక్‌ చేయవద్దు. అవి మోసపూరిత సందేశాలు. వాటిని మేము పంపడంలేదు’ అని ఐటీ విభాగం ఆదివారం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. గత నెల 8 నుంచి 20 వరకు ఐటీ విభాగం వివిధ రకాల పన్ను చెల్లింపుదారులకు రూ.9 వేల కోట్లకుపైగా రిఫండ్‌ చేసినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


logo