శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 07, 2021 , 18:43:52

ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీలపై బోగస్‌ ‘ఐటీసీ’ ఆరోపణలు

ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీలపై బోగస్‌ ‘ఐటీసీ’ ఆరోపణలు

బెంగళూరు: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అనుబంధ ఇన్‌స్టాకార్ట్‌, స్విగ్గీ సంస్థల యాజమాన్యాలు పన్ను ఎగవేతకు పాల్పడేందుకు బోగస్‌ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని సదరు సంస్థల ప్రధాన కార్యాలయాలపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు జరిపారు. 

సదరు రెండు సంస్థలు బోగస్‌ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) దాఖలు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. దీనిపై ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ దర్యాప్తు సంస్థలకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందజేసి, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. 

అయితే, తాము బోగస్‌ ఐటీసీ దాఖలు చేశామని వచ్చిన వార్తలను ఇన్‌స్టాకార్ట్‌ తొలుత నిరాకరించింది. రెండు సంస్థలు జీఎస్టీ చెల్లించకపోవడంపై జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు దర్యాప్తు చేపట్టిందని, తాము వారికి సహకరిస్తున్నామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్‌ యూనిట్‌గా ఇన్‌స్టాకార్ట్‌ పని చేస్తున్నది. కాగా, ఇప్పటి వరకు జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన ఏడు వేల సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo