శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 04, 2020 , 21:10:53

ఐటీ రిట‌ర్న్‌ల దాఖలుకు గ‌డువు పెంపు

ఐటీ రిట‌ర్న్‌ల దాఖలుకు గ‌డువు పెంపు

న్యూఢిల్లీ: దేశంలో ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువును ఆదాయ‌పు ప‌న్ను విభాగం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల‌ దాఖలు చేయడానికి తుది గడువును నవంబర్‌ 30గా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి నేప‌థ్యంలో తాజా నిర్ణయం తీసుకొన్నామ‌ని, ఇది పన్ను చెల్లింపుదారుల‌కు ప్రయోజనకరంగా ఉంటుందని ఐటీ శాఖ పేర్కొన్న‌ది. 

వాస్తవానికి ఆదాయ‌ పన్ను రిట‌ర్న్‌ల‌ను జూలై 31లోపు చెల్లించాల్సి ఉంది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఐటీ శాఖ‌ వెల్ల‌డించింది. దీంతోపాటు 2019-20 టీడీఎస్, టీసీఎస్‌ స్టేట్‌మెంట్లకు కూడా గడువును ఆగస్టు 15 వరకు పొడిగించారు. ఆదాయ‌ప‌న్నుచెల్లింపు గ‌డువు తేదీల‌ను పెంచ‌నున్న‌ట్లు ప్రభుత్వం గ‌త వార‌మే స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఇప్పుడు నిర్ణ‌యం చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo