ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 04, 2021 , 18:43:08

పన్ను ఎగవేత: జీ గ్రూప్‌పై ఐటీ దాడులు

పన్ను ఎగవేత: జీ గ్రూప్‌పై ఐటీ దాడులు

ముంబై: ప్రముఖ టీవీ చానెల్‌ గ్రూప్‌ ‘జీ’ కార్యాలయాల్లో ఆదాయం పన్నుశాఖ (ఐటీ) అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ముంబైలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. 15కి పైగా చోట్ల తనిఖీలు చేశారు. పన్ను ఎగవేతకు పాల్పడటంతోపాటు బోగస్‌ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను జీ గ్రూప్‌ దాఖలు చేసిందని ఐటీ అధికారులు చెప్పారు. 

‘జీ’ గ్రూప్‌ భారీ స్థాయిలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సమాచారాన్ని ఆదాయం పన్నుశాఖ అధికారులతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇంటెలిజెన్స్‌ (డీజీసీఈఐ) షేర్‌ చేసుకుందని అధికార వర్గాల కథనం. పన్ను ఎగవేత కేసులో వివిధ గ్రూపులకు చెందిన కొన్ని కార్యాలయాల్లో సోదాలు జరిపామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఐటీ అధికారి చెప్పారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తామని తెలిపింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo