మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 01, 2021 , 02:41:32

వ్యయంతోనే వృద్ధికి ఊతం

వ్యయంతోనే వృద్ధికి ఊతం

ప్రభుత్వ వ్యయం అతిపెద్ద వృద్ధి చోదకశక్తి. ప్రభుత్వ వ్యయం పెరగడాన్ని భవిష్యత్‌కు ఓ పెట్టుబడిగా చూడాలి తప్పితే ఆర్థిక లోటు లక్ష్యాన్ని మేనేజ్‌ చేసేందుకు తగ్గించాల్సిందిగా చూడకూడదు. ఈ దశలో ప్రభుత్వ పెట్టుబడులు అనేవి స్వల్ప వ్యవధిలో అధిక స్థాయిలో బహుళ విధాలుగా ప్రభావం కనబరచగలిగే ప్రాజెక్టులు, పథకాలపై ఉండాలి. దాంతో ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు అధికమవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌లో కొన్ని చర్యలు చేపట్టడం సముచితం. అల్పాదాయ, మధ్యాదాయ కుటుంబాలు ఉపయోగించే వస్తుసేవలపై (గృహోపకరణాలు, సైకిల్‌ టైర్లు లాంటివి), ఇంటి నిర్మాణానికి ఉపయోగించేవాటిపై (సిమెంటు), రవాణా సాధనాలపై (నాణ్యమైన ప్రజారవాణా అందుబాటులోకి వచ్చేవరకు ద్విచక్రవాహనాలపై) జీఎస్టీ తగ్గించడం అవసరం. అత్యధికుల జీవన వ్యయాలను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. పెట్రోలు, డీజిల్‌పై సుంకాలను తగ్గించేందుకు కాలనిర్దేశిత ప్రణాళికను ప్రవేశపెట్టాలి. మధ్యాదాయ తరగతివారికి ప్రైవేటు రవాణ ఓ తప్పనిసరి అవసరం. అది వారికి విలాసం కాదు. ఇంధన ధరలు పెరిగినా, వినియోగం తగ్గే అవకాశం లేదని గుర్తించాలి. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వేతనజీవులపై, ఎంఎస్‌ఎంఈలపై భారం తగ్గించడం ముఖ్యం. కొంత భారాన్ని పెద్ద సంస్థలపై వేయాలి. కార్పొరేట్‌ పన్నులు తగ్గించడం లేదా కొన్నేండ్ల వరకు లెవీ విధించడం ద్వారా ప్రత్యక్ష పన్నులను రెట్టింపు చేయవచ్చు. ప్రాధాన్యం ఇవ్వాల్సిన మరో రంగం ఆర్థిక, సామాజిక మౌలిక వసతుల రంగం. అలా చేయడం ద్వారా సగటు భారతీయుడి జీవన వ్యయం తగ్గించడం, జీవన నాణ్యత పెంచడం సాధ్యమవుతుంది. 

అనిల్‌ సూద్‌, ప్రొఫెసర్‌, కో ఫౌండర్‌ ఐఏఎస్‌సీసీ

(ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ ఛాయిసెస్‌)

VIDEOS

logo