e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News హోట‌ళ్లు స‌హా వివిధ రంగాల‌కు ఆర్బీఐ ఇలా చేయూత‌!

హోట‌ళ్లు స‌హా వివిధ రంగాల‌కు ఆర్బీఐ ఇలా చేయూత‌!

హోట‌ళ్లు స‌హా వివిధ రంగాల‌కు ఆర్బీఐ ఇలా చేయూత‌!

న్యూఢిల్లీ/ ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారితో విల‌విల్లాడుతున్న రంగాల‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ ప‌లు కీల‌క నిర్ణ‌యాలే తీసుకున్న‌ది. ప‌లు ఫైనాన్సియ‌ల్‌, ఆర్థిక‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ప్ర‌క‌టించింది. ఆర్థికంగా సంక్షోభంలో చిక్క‌కున్న సెక్టార్ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్యేకంగా ద్ర‌వ్య ల‌భ్య‌త కోసం రూ.15వేల కోట్ల నిధులు అందుబాటులో ఉంచింది. ఈ నిధులు వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు వినియోగించుకోవ‌చ్చు.

హోట‌ళ్లు, రెస్టారెంట్లు, టూరిజం-ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆప‌రేట‌ర్లు, అడ్వెంచ‌ర్/హెరిటేజ్ ఫెసిలిటీ, ఏవియేష‌న్ అనుబంధ సేవ‌లు – గ్రౌండ్ హ్యాండ్లింగ్ అండ్ స‌ప్ల‌యి చైన్ త‌దిత‌ర రంగాల‌కు రిలీఫ్ క‌ల్పించింది.

ఇందుకోసం రూ.15 వేల కోట్లు కేటాయించింది. హోట‌ళ్ల‌కు ఈ నిధుల‌తో బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు రుణాలు మంజూరు చేయ‌నున్నాయి. ప్రైవేట్ బ‌స్ ఆప‌రేటర్లు, కారు రిపేర్ సేవ‌లు, స్పా క్లినిక్‌లు, బ్యూటీ పార్ల‌ర్లు, స‌లూన్ల‌కు కూడా రుణాలిస్తాయి. ఈ రంగాల‌కిచ్చే రుణాల‌పై 25బీపీఎస్ వ‌డ్డీరేటు వ‌ర్తిస్తుంది.

స్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ)కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించింది. సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలివ్వ‌డానికి సిడ్బీకి ప్ర‌త్యేంక‌గా రూ.16 వేల కోట్ల ద్ర‌వ్య ల‌భ్య‌త పొడిగించాల‌ని నిర్ణ‌యించింది.

ఇక ఆదివారాలు, ఇత‌ర బ్యాంకు సెల‌వు దినాల్లోనూ న‌గ‌దు విత్ డ్రాయ‌ల్స్‌తోపాటు ఖాతాదారుల‌కు అన్ని ర‌కాల బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులోకి తెచ్చేందుకు నేష‌న‌ల్ ఆటోమేటెడ్ క్లియ‌రింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్‌)ను అనుమ‌తించింది.

దీని వ‌ల్ల వేత‌నాలు కూడా సెల‌వు దినాల్లో సంబంధిత సంస్థ‌ల ఉద్యోగుల ఖాతాల్లో జ‌మ అవుతాయి. క్రెడిట్ ట్రాన్స‌ఫ‌ర్‌, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఎప్పుడైనా చేయొచ్చు. ఇది గ‌త ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి వ‌స్తుంది.

ప్ర‌త్యేకించి ఇండియ‌న్ డెట్ మార్కెట్‌లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట‌ర్ల పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించేందుకు ఆర్బీఐ ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.

ఇవి కూడా చ‌దవండి:

ఇలాగైతే 2025 నాటికే అంద‌రికీ వ్యాక్సిన్ : శివ‌సేన‌

కేఎస్ఆర్టీసీ ఇక కేర‌ళ‌దే.. క‌ర్ణాట‌క‌కు షాక్‌

కశ్మీర్‌ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..

ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

జీన్స్‌, టీషర్ట్స్ వేసుకోవ‌ద్దు.. సీబీఐ అధికారుల‌కు కొత్త డైరెక్ట‌ర్ ఆదేశాలు

ఆ వేరియంట్ వ‌ల్లే ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్‌: ప్ర‌భుత్వ అధ్య‌య‌నం

అత్యంత అంద‌విహీన‌మైన భాష క‌న్న‌డ అన్న గూగుల్‌.. క్ష‌మాప‌ణ చెప్పిన సంస్థ‌

కోవిన్‌ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడ‌కానికి ద‌ర‌ఖాస్తు

పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..

ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎవ‌రూ కాపాడ‌లేరు : ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల‌

రూ.43000 కోట్ల‌తో ఆరు స‌బ్‌మెరైన్ల నిర్మాణానికి ఆమోదం

వ్యాక్సిన్ వేసుకున్న వారికి క‌రోనా వ‌చ్చినా చ‌నిపోలేదు: ఎయిమ్స్ అధ్య‌య‌నం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హోట‌ళ్లు స‌హా వివిధ రంగాల‌కు ఆర్బీఐ ఇలా చేయూత‌!

ట్రెండింగ్‌

Advertisement