ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 02:19:34

ఆకట్టుకున్న ఆర్థిక, ఐటీ షేర్లు

ఆకట్టుకున్న ఆర్థిక, ఐటీ షేర్లు

  • లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 399, నిఫ్టీ 120 పాయింట్లు వృద్ధి

ముంబై, జూలై 20: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక, ఐటీ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సెన్సెక్స్‌ 398.85 పాయింట్లు ఎగబాకి 37,418.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 120.50 పాయింట్లు ఎగిసి 11వేల మార్కును అధిగమించి 11,022.20 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకుని 74.91 వద్ద ముగియడం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ విలువ అత్యధికంగా 4.23 శాతం పెరిగింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లూ లాభాలను అందుకున్నాయి. మరోవైపు సన్‌ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతి సుజుకీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు 3.86 శాతం మేర నష్టపోయాయి. మొత్తంగా ఆర్థిక, బ్యాంకింగ్‌, ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగాల షేర్లు లాభపడగా.. హెల్త్‌కేర్‌, పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి.


logo