బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?

న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు సహా దాదాపు 50కి పైగావస్తువులపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5 నుంచి 10 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పలు వస్తువులపై దిగుమతి సుంకాల పెంపు దిశగా కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ సుంకాల పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా రూ .20,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది.
ఇక సుంకాల పెంపుతో ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వాహన రంగాలు ప్రభావితమవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుంకాల పెంపుతో స్వీడన్ ఫర్నిచర్ సంస్థ ఐకియా, భారత్లో ఈ ఏడాది కార్లను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమైన టెస్లా వంటి దిగ్గజ సంస్థల ప్రణాళిలపై ప్రభావం చూపనుంది. అయితే ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలు ఎంతమేర పెరుగుతాయనే దానిపై అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దిగుమతి సుంకాలు పెరిగితే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, స్మార్ట్ఫోన్లు సహా పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాగా, ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
- రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
- పీడీయాక్టు పెట్టినా మారలేదు..
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్