శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 03:25:59

నేటినుంచి ఐకియా స్టోర్‌ మూత

నేటినుంచి ఐకియా స్టోర్‌ మూత

హైదరాబాద్‌: స్వీడన్‌కు చెందిన ఫర్నీచర్‌ తయారీ సంస్థ ఐకియా శనివారం (జూలై 18) నుంచి హైదరాబాద్‌లోని ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అదనపు భద్రతా చర్యల అమలు కోసం ఈ చర్య చేపడుతున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు తమ కస్టమర్లందరికీ మెయిళ్లు పంపింది. హైదరాబాద్‌ ఔట్‌లెట్‌ను మళ్లీ ఎప్పుడు తెరిచేదీ ఆ మెయిళ్లలో తెలుపలేదు. అయితే తమ ఆన్‌లైన్‌ స్టోర్‌ మాత్రం తెరిచే ఉంటుందని ఐకియా ఇండియా స్పష్టం చేసింది.logo