బుధవారం 03 జూన్ 2020
Business - May 12, 2020 , 00:05:25

బండితోనే భద్రత

బండితోనే భద్రత

  • కరోనా నేపథ్యంలో కస్టమర్లకు ప్యూర్‌ ఎనర్జీ పీపీఈ కిట్‌

కంది (సంగారెడ్డి): తమ కంపెనీ వాహనాలను కొన్నవారికి భద్రత కిట్టునూ ఇస్తామని ప్యూర్‌ ఎనర్జీ అంటున్నది. కరోనా వైరస్‌ నేపథ్యంలో కస్టమర్లకు పీపీఈ కిట్టుతోపాటు ఐదు మాస్కులు, ఐదు శానిటైజర్లను అందజేస్తామని సోమవారం ఆ సంస్థ ప్రకటించింది. మార్కెట్‌లో వీటి ధర సుమారు రూ.2 వేల వరకు ఉంటుందని, కొత్త బండి కొన్నవారికి వీటిని పూర్తి ఉచితంగా ఇస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇప్లూటో పేరిట ప్యూర్‌ ఎనర్జీ ఫిబ్రవరిలో రెండు వేరియేషన్లలలో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వాహనం ధర రూ.79,999గా ఉన్నది. అయితే కరోనా వైరస్‌తో వచ్చిపడిన లాక్‌డౌన్‌ మార్కెట్‌ను కుదేలు చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్టుగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్యూర్‌ ఎనర్జీ తాజా ఆఫర్‌తో ముందుకొచ్చింది.


logo