బుధవారం 03 జూన్ 2020
Business - May 10, 2020 , 00:02:59

ఐసీఐసీఐకి కరోనా కాటు

ఐసీఐసీఐకి  కరోనా కాటు

  • క్యూ4లో లాభం రూ.1,251 కోట్లకే పరిమితం 
  • బ్యాంక్‌పై వైరస్‌ ప్రభావం రూ.2 వేల కోట్లపైనే

ముంబై, మే 9: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాలకు కరోనా వైరస్‌ గండి కొట్టింది. ఈ మహమ్మారి ఉద్ధృతితో మార్కెట్‌లో ఏర్పడిన విపత్కర పరిస్థితులు బ్యాంక్‌ను ఆర్థికంగా రూ.2 వేల కోట్ల మేర ప్రభావితం చేశాయి. నికర నిరర్థక ఆస్తులు, స్థూల నిరర్థక ఆస్తులు పెరిగే వీలుందన్న సంకేతాలను శనివారం బ్యాంక్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.1,251 కోట్లకే పరిమితమైనట్లు ప్రకటించింది. అయితే స్టాండలోన్‌ ఆధారంగా 26 శాతం వృద్ధితో లాభం రూ.969 కోట్ల నుంచి రూ.1,221 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. మరోవైపు రుణ సెక్యూరిటీల ద్వారా రూ.25 వేల కోట్ల వరకు బ్యాంక్‌ సమీకరించనున్నది.


logo