శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 31, 2021 , 00:56:28

ఆకట్టుకున్న ఐసీఐసీఐ బ్యాంక్‌

ఆకట్టుకున్న ఐసీఐసీఐ బ్యాంక్‌

  • క్యూ3లో రూ.5,498 కోట్ల లాభం

ముంబై, జనవరి 30: ప్రైవేట్‌ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.5,498.15 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,670.10 కోట్లతో పోలిస్తే 17.73 శాతం అధికం. ఏకీకృత ఆధారంగా గత త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 19.12 శాతం ఎగబాకి రూ.4,939.59 కోట్లుగా నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ.23,638 కోట్ల నుంచి రూ.24,416 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో నిర్వహణ ఖర్చులు రూ.16,089 కోట్ల నుంచి రూ.15,596 కోట్లకు తగ్గాయి. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.38 శాతంగా ఉన్నది. మొండిబకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ భారీ స్థాయిలో నిధులను కేటాయించింది. ఇదేక్రమంలో గత త్రైమాసికంలోనూ రూ.2,741 కోట్ల నిధులను కేటాయించింది. ఏడాది క్రితం ఇది రూ.2,083 కోట్లు. రెండో త్రైమాసికంలో కేటాయించిన నిధులతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. డిసెంబర్‌ 31 నాటికి కరోనా-19కు సంబంధించిన కేటాయింపులే రూ.9,984.46 కోట్లు ఉన్నట్లు బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బ్యాంక్‌ మొత్తం ఆడ్వాన్స్‌లు 10 శాతం పెరిగి రూ.6.99 లక్షల కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు 22 శాతం ఎగబాకి రూ.8.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

VIDEOS

logo