సోమవారం 01 మార్చి 2021
Business - Jan 30, 2021 , 21:44:51

ఐసీఐసీఐ నిక‌ర లాభం 19% .. కానీ ఎన్ఐఐలో 16% ఎదుగుద‌ల‌

ఐసీఐసీఐ నిక‌ర లాభం 19% .. కానీ ఎన్ఐఐలో 16% ఎదుగుద‌ల‌

న్యూఢిల్లీ:ప‌్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికంలో  2019-20తో పోలిస్తే 19 శాతం నిక‌ర లాభాలు గ‌డించింది. గ‌తేడాది రూ.4,146 కోట్ల నిక‌ర లాభం గ‌డించిన ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఏడాది రూ.4,940 కోట్ల లాభం సంపాదించింది. అయితే నిక‌ర వ‌డ్డీ ఆదాయంలో మాత్రం తేడా ఉంది. 

గ‌తేడాదితో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం నిక‌ర వ‌డ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16 శాతం మాత్ర‌మే పెరిగి రూ.9,912.5 కోట్ల‌కు చేరుకుంది. ఇక 2019-20తో పోలిస్తే 2020 డిసెంబ‌ర్ నాటికి డిపాజిట్లు 22 శాతం పెరిగి రూ.8,74,348 కోట్ల వ‌ద్ద స్థిర ప‌డ్డాయి. స‌గ‌టున క‌రంట్ అండ్ సేవింగ్స్ ఖాతాల్లో 19 శాతం గ్రోత్ రేట్ క‌నిపించింది. ట‌ర్మ్ డిపాజిట్ల‌లో 26 శాతం గ్రోత్ న‌మోదైంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo