ఆదివారం 29 నవంబర్ 2020
Business - Nov 01, 2020 , 02:00:15

ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఆరింతలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఆరింతలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఆరింతలు పెరిగి రూ.4,251 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇది రూ.655 కోట్లుగా ఉన్నది. 2019-20 రెండో త్రైమాసికంలో రూ.22,759.52 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి రూ. 23,650.77 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)  5.37 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. విలువ ఆధారంగా చూస్తే ఇవి రూ.45,638.79 కోట్ల నుంచి రూ.38,989.19 కోట్లకు దిగివచ్చాయి. అలాగే నికర ఎన్‌పీఏలు కూడా 1.60 శాతం (రూ.10,916.40 కోట్లు) నుంచి ఒక్క శాతానికి (రూ.7,187.51 కోట్లకు) తగ్గినట్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.