శుక్రవారం 05 జూన్ 2020
Business - May 21, 2020 , 20:25:59

ఎఫ్‌డీలపై వడ్డీ పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు

ఎఫ్‌డీలపై వడ్డీ పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్‌ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదనంగా 0.80 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ బ్యాంకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే సీనియర్‌ సిటిజన్లకు 0.50 శాతం అధిక వడ్డీ చెల్లిస్తున్నది. 5 నుంచి 10 ఏండ్ల కాలపరిమితితో రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే సీనియర్‌ సిటిజన్లకు వార్షికంగా 6.55 శాతం వడ్డీ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పథకం సెప్టెంబర్‌ 30 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ‘ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే వృద్ధులకు ప్రధాన ఆదాయవనరని మాకు తెలుసు. అందుకే సీనియర్‌ సిటిజన్లపై ఉన్న గౌరవంతో కొత్త పథకం ద్వారా వారికి అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాం’ అని ఐసీఐసీఐ లయబిలిటీస్‌ గ్రూప్‌ అధిపతి ప్రణవ్‌ మిశ్రా తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంకులు ఇప్పటికే సీనియర్‌ సిటిజన్లకు చెల్లించే వడ్డీని పెంచిన విషయం తెలిసిందే.


logo