ముంబై, జూలై 20: ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త ఆఫర్లతో ఓ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. ప్రధానంగా ఇంధన కొనుగోళ్లపై రాయితీలను కల్పిస్తూ హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ భాగస్వామ్యంతో ‘ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్’ కార్డ్‌ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌పీసీఎల్ బంకుల్లో ఇంధన కొనుగోళ్లపై కార్డుదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని, ‘హెచ్‌పీ పే’ యాప్ ద్వారా చెల్లిస్తే మరో 1.5 శాతం అదనపు ప్రయోజనం ఉంటుందని బ్యాంక్ తెలిపింది.