సోమవారం 01 జూన్ 2020
Business - May 21, 2020 , 23:47:07

వృద్ధులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ శుభవార్త

వృద్ధులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ శుభవార్త

ముంబై: ప్రైవేట్‌ రంగంలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్‌ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదనంగా 0.80 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ బ్యాంకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే సీనియర్‌ సిటిజన్లకు 0.50 శాతం అధిక వడ్డీ చెల్లిస్తున్నది. 5 నుంచి 10 ఏండ్ల కాలపరిమితితో రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే సీనియర్‌ సిటిజన్లకు వార్షికంగా 6.55 శాతం వడ్డీ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పథకం సెప్టెంబర్‌ 30 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. 


logo