శనివారం 30 మే 2020
Business - Apr 15, 2020 , 00:19:34

ఐసీఐసీఐ బ్యాంక్‌ 100 కోట్ల విరాళం

ఐసీఐసీఐ బ్యాంక్‌ 100 కోట్ల విరాళం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కోవిడ్‌-19కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న  ప్రభుత్వానికి ఐసీఐసీఐ బ్యాంకు రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. రూ.80 కోట్లను పీఎం సహాయ నిధికి అందిస్తున్న బ్యాంక్‌.. మిగతా రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు, ఆస్పత్రులు, సీఐఎస్‌ఎఫ్‌, పోలీసు వంటి విభాగాల కోసం అవసరమయ్యే పరిరక్షణ పరికరాల (ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) కోసం అందజేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు అధ్యక్షుడు సందీప్‌ బాత్రా తెలిపారు.  మరోవైపు సామ్‌సంగ్‌ ప్రధాని సహాయనిధికి రూ. 20 కోట్లు విరాళంగా అందించింది. logo