గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గింపు
ముంబై, మార్చి 5: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థల్లో అగ్రగామి బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. స్వల్పకాలం పాటు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీరేటు 6.70 శాతానికి దించింది. ఈ ప్రత్యేక వడ్డీ ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నదని తెలిపింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయం గృహ రుణాలపై వడ్డీరేటు పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు అయింది. రూ.75 లక్షల లోపు రుణాలపై వడ్డీని 6.70 శాతంగాను, ఆపై రుణాలపై వడ్డీని 6.75 శాతంగా నిర్ణయించింది.