శనివారం 30 మే 2020
Business - May 24, 2020 , 00:12:39

ఐబీఎంలో వేలమందిపై వేటు

ఐబీఎంలో వేలమందిపై వేటు

  • లెండింగ్‌కార్ట్‌ నుంచి 200 మంది ఔట్‌

శాన్‌ఫ్రాన్సిస్కో/అహ్మదాబాద్‌, మే 23: కరోనా సంక్షోభానికి తాళలేక ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో టెక్‌ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. ఉద్యోగులను తొలగించనున్నట్టు శుక్రవారం రాత్రి జారీచేసిన ఓ ప్రకటనలో ఐబీఎం ధ్రువీకరించింది. ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నదీ ఐబీఎం స్పష్టం చేయకపోయినప్పటికీ ఆ సంస్థలో కనీసం 5,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నట్టు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు హ్యూలెట్‌ పాకార్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (హెచ్‌పీఈ) తమ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో 20 నుంచి 25 శాతం మేరకు కోత విధించబోతున్నట్టు తెలుస్తున్నది.

లెండింగ్‌కార్ట్‌లో..

ఆన్‌లైన్‌ ఫైనాన్సింగ్‌ సంస్థ లెండింగ్‌కార్ట్‌ తమ కంపెనీ నుంచి 200 మంది ఉద్యోగులను (30 శాతం మందిని) తొలగించింది. లాక్‌డౌన్‌ వల్ల ఈ కంపెనీ ఇబ్బందుల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణం. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలకు పూచీకత్తు లేకుం డా రూ.లక్ష నుంచి రూ.40 లక్షల వరకు రుణాలను అందజేస్తున్నది. 


logo