టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కానుంది. మరోవైపు రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో శ్యామ్ సింగరాయ్ చేస్తున్నాడు. వీటితోపాటు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. ఈ మూడు క్రేజీ మూవీస్ తో బిజీగా ఉన్న నాని ఇపుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈసారి నాని కొత్త వ్యక్తికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వబోతున్నాడట. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాజీ అసిస్టెంట్ శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని టాక్. కొత్తదనంతో కూడిన పాత్రలను ప్రేక్షకులకు అందించడంలో ముందుండే నాని మరి ఈసారి న్యూ డైరెక్టర్ తో ఎలాంటి సినిమా చేస్తాడా..అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.