శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 25, 2020 , 21:37:50

ఐటీ రిటర్న్స్‌ ‘జాట్‌పాట్‌ ప్రాసెసింగ్‌’ ఇలా

ఐటీ రిటర్న్స్‌ ‘జాట్‌పాట్‌ ప్రాసెసింగ్‌’ ఇలా

న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్‌ గడువు దగ్గర పడుతుండటంతో పన్ను చెల్లింపు దారుల కోసం ఆదాయం పన్నుశాఖ (ఐటీ) నూతన ఇన్సియేటివ్‌ను ప్రారంభించింది. నిరంతరాయంగా ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ కోసం ‘జాట్‌పాట్‌ ప్రాసెసింగ్‌’ ఫీచర్‌ను ఆవిష్కరించింది. ట్విట్టర్‌ వేదికగా ఐటీ శాఖ ‘జాట్‌పాట్‌ ప్రాసెసింగ్‌’ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఇంతకుముందే ప్రకటించింది. ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4 దాఖలు కోసం ఈ ఫీచర్‌ ప్రారంభించిన ఐటీ శాఖ.. దీన్ని 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేవారు.. ఈ ఫైలింగ్‌ వెబ్‌ సైట్‌ ‘incometaxindiaefiling.gov.in.’ లో సందర్శించాలని తెలిపింది. 

ముందే ధ్రువీకరించిన బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటంతోపాటు ఐటీఆర్‌ దాఖలు చేసిన వారు మాత్రమే ఈ ఫీచర్‌ పొందేందుకు వీలు ఉంది. ఆదాయంలో వ్యత్యాసాలు, చెల్లింపుల్లో పెండింగ్‌ లేని వారు, చలాన్ల చెల్లింపులు, టీడీఎస్‌ చెల్లింపుల్లో తేడా లేని వారు మాత్రమే ఈ ఫీచర్‌ పొందే వెసులుబాటు కలిగి ఉన్నారు. కరోనా నేపథ్యంలో 2019-20 (2020-21లో అంచనా) ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడానికి 2020 డిసెంబర్‌ నెలాఖరు వరకు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పొడిగించింది. సాధారణంగా ప్రతియేటా జూలై నెలాఖరు వరకే ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడానికి గడువు ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo