గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 08, 2020 , 13:05:51

కరోనా ఎఫెక్ట్‌..హ్యుందాయ్‌ ప్లాంట్‌ మూసివేత

కరోనా ఎఫెక్ట్‌..హ్యుందాయ్‌ ప్లాంట్‌ మూసివేత
  • ప్రపంచంలో భారీ కర్మాగారం

సియోల్‌: ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకత కలిగిన తమ భారీ వెహికల్‌ కాంప్లెక్స్‌ను హ్యుందాయ్‌ శుక్రవారం మూసేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తివల్ల చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా క్షీణించి వాహన విడిభాగాల కొరత ఏర్పడటమే ఇందుకు కారణం. ఉల్సన్‌లోని ఈ భారీ కాంప్లెక్స్‌కు ఏటా 14 లక్షల వాహనాలను తయారుచేసే సామర్థ్యమున్నది. ఈ కాంప్లెక్‌ మూసివేతతో వేలమంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 25 వేలమంది కార్మికులను బలవంతపు సెలవుతో సాగనంపిన హ్యుందయ్‌ యాజమాన్యం.. వారికి అరకొర వేతనాలిచ్చి సరిపెడుతున్నది.


విడిభాగాల కొరతతో..

టోక్యో:  విడిభాగాల సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో భారత్‌లో తమ వాహనాల ఉత్పత్తికి విఘాతం కలిగే అవకాశం ఉన్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి విడిభాగాలను తెప్పించుకోవడంపై పరిశీలన జరుపుతున్నామని జపాన్‌ ఆటోమొబైల్‌ సంస్థ సుజుకీ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు చైనాలోని తమ అన్ని ప్లాంట్లను ఈ నెల 16 వరకు మూసివేయనున్నట్టు టొయోటా ప్రకటించగా.. చైనాలోని వాహన సరఫరాదారులు త్వరగా విధుల్లో చేరకపోతే యూరప్‌లోని తమ ప్లాంట్‌ను రెండు వారాల్లో మూసేస్తామని ఫియట్‌ క్రిస్లర్‌ సంస్థ స్పష్టం చేసింది.


logo
>>>>>>