గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 03, 2021 , 19:35:40

2నెలల్లోనే 35 వేలు దాటిన న్యూ ఐ20 బుకింగ్స్‌

2నెలల్లోనే 35 వేలు దాటిన న్యూ ఐ20 బుకింగ్స్‌

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటో మేజర్‌ హ్యుండాయ్‌ ఇండియా గతేడాది నవంబర్‌ నెలలో ఆవిస్కరించిన న్యూ జనరేషన్‌ ‘ఐ20’ మోడల్‌ కారు కోసం కేవలం రెండు నెలల్లోనే 35వేల బుకింగ్స్‌కు నమోదయ్యాయి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కార్లు ఇప్పటికే 8,000 యూనిట్లు విక్రయించినట్లు హ్యుండాయ్‌ ప్రకటించింది. అతి తక్కువ కాలంలో సక్సెస్‌ఫుల్‌ కారుగా న్యూ జనరేషన్‌ ‘ఐ20* మోడల్‌ కారు నిలువడం విశేషం.  

కే-ప్లాట్‌ఫామ్‌పై ఆల్‌ న్యూ హ్యుండాయ్‌ ఐ20 మోడల్‌ కారును నిర్మించారు. లాంగర్‌ వీల్‌ బేస్‌ గల ఈ మోడల్ కారు పెట్రోల్‌, డీజిల్‌ వర్షన్లలో లభ్యం అవుతున్నది. న్యూ ఐ 20 మోడల్‌ కార్లపై పలు ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్‌ వర్షన్‌ ఐ20 న్యూ జనరేషన్‌ కారు రూ. 6.80 లక్షల నుంచి రూ.11.18 లక్షల వరకు పలుకుతున్నది. ఇక డీజిల్‌ మోడల్‌ కారు ధర రూ.8.20 లక్షల నుంచి మొదలై రూ.10.60 లక్షలు పలుకుతున్నది. న్యూ జనరేషన్‌ హ్యుండాయ్‌ ఐ 20 మోడల్‌ కారు 4 వారియంట్లు – మాగ్న, స్పోర్ట్జ్, ఆస్తా, ఆస్తా (O) వర్షన్లలో లభ్యం అవుతుంది.

కారు పొడవు 10 మిల్లీమీటర్లు పెరిగింది. ఇది 3995 మిల్లీ మీటర్ల వద్ద స్థిరపడింది. కారు 41 మిల్లీ మీటర్ల వెడల్పు వరకు పెరిగినా ఎత్తులో మాత్రం మార్పు లేదు. వీల్‌ బేస్‌ 10మిల్లీ మీటర్లు పెరగడంతో మరింత స్పేస్‌ కలిసి వస్తుంది. ఇంతకుముందు మోడల్‌ కారుతో పోలిస్తే న్యూ జనరేషన్‌ ఐ 20 మోడల్‌ కారులో రేర్ లెగ్‌ రూమ్‌ పొడవు 88 మిల్లీ మీటర్లకు దూసుకెళ్లడం బిగ్‌ ఇంప్రూవ్ మెంట్‌ కానుంది. ఈ మోడల్‌ కారులో మూడు ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. అందులో 1.2 లీటర్ల నేచురల్‌ ఆస్పైర్డ్ పెట్రోల్‌, ఒక లీటర్‌ టర్బో పెట్రోల్‌, 1.5 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లున్నాయి. 

1.2 లీటర్ల నేచురల్‌ ఆస్పైర్డ్ పెట్రోల్‌, 1.5 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు గల కార్లలో మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ అందుబాటులో ఉంటుంది. 1.0  లీటర్ల టర్బో ఇంజిన్‌ వర్షన్‌ కారులో మాత్రమే ఇంటెలిజెంట్‌ మాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌ లభ్యమవుతుంది. ఇందులో బ్లూ లింక్‌ కనెక్టివిటీని తొలిసారి అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు 50 ఫీచర్లు లభ్యం అవుతాయి. వెర్నా, క్రెటా, ఎలంత్రా మోడల్‌ కార్లలోని పీచర్లనూ న్యూ జనరేషన్‌ ఐ20లోనూ చూడొచ్చు. క్లైమేట్ కంట్రోల్‌, ఆపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో తదితర ఫీచర్లూ ఉన్నాయి. 

VIDEOS

logo