శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 16, 2021 , 03:27:00

హైదరాబాద్‌-షికాగో నాన్‌స్టాప్‌

హైదరాబాద్‌-షికాగో నాన్‌స్టాప్‌

  • ప్రారంభించిన ఎయిర్‌ ఇండియా

శంషాబాద్‌, జనవరి 15: రాష్ట్రం నుంచి నేరుగా అమెరికాకు వెళ్ళేవారికి శుభవార్తను అందించింది ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా. హైదరాబాద్‌ నుంచి షికాగోకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసును శుక్రవారం నుంచి  అందుబాటులోకి తీసుకొచ్చింది. 237 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో కూడిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 777 ఏఏ-108 విమానం శుక్రవారం ఉదయం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బంది ఆ ఫ్లైట్‌కు ఘనస్వాగతం పలికి కేక్‌ కట్‌ చేశారు.  తిరుగు ప్రయాణంలో బోయింగ్‌ 777 ఎల్‌ఆర్‌-107 విమాన సర్వీసు మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి షికాగోకు బయలుదేరింది. ఈ సర్వీసును వారానికి ఒక్కరోజు మాత్రమే నడుస్తుం ది. హైదరాబాద్‌-షికాగో మధ్య శుక్రవారం.. షికాగో-హైదరాబాద్‌ల మధ్య బుధవారం ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

VIDEOS

logo