బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 23:38:42

హైదరాబాద్‌-పుణె గోఎయిర్‌

హైదరాబాద్‌-పుణె  గోఎయిర్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రముఖ విమానయాన సంస్థ గో-ఎయిర్‌.. హైదరాబాద్‌- పుణెల మధ్య డైరెక్టు సర్వీసును ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.  ఫిబ్రవరి 5 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు శనివారం మినహా మిగతా రోజుల్లో నడుపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.  హైదరాబాద్‌లో ఉదయం 11.05 గంటలకు బయలుదేరనున్న ఈ సర్వీసు మధ్యాహ్నాం 12.25 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో పుణెలో మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి తిరిగి 2.20 గంటలకు చేరుకోనున్నది. రానుపోను చార్జీలను రూ.4,850గా నిర్ణయించింది. ఇరు ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య, పర్యాటక సంబంధాలతోపాటు ఐటీ ఇండస్ట్రీకీ సంబంధించి వ్యవహారాలు అధికంగా ఉండటం వల్లనే విమానాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సర్వీసును ఆరంభించబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం సంస్థ.. పుణెతోపాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొలకత్తా, నాగ్‌పూర్‌లతోపాటు హైదరాబాద్‌- అహ్మదాబాద్‌ , బెంగళూరు, చండీఘడ్‌, చెన్నై, ఢిల్లీ, గోవా, జైపూర్‌, కన్నూర్‌, కొచ్చి, కొలకత్తా, లక్నో , పాట్నాలకు సర్వీసులు నడుపుతున్నది.  


logo
>>>>>>