శుక్రవారం 30 అక్టోబర్ 2020
Business - Sep 18, 2020 , 00:21:36

దేశీయ స్మార్ట్‌ సిటీల్లో హైదరాబాదే టాప్‌

దేశీయ స్మార్ట్‌ సిటీల్లో హైదరాబాదే టాప్‌

న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ సిటీల్లో హైదరాబాద్‌ సత్తా చాటింది. తాజాగా విడుదలైన 2020 గ్లోబల్‌ స్మార్ట్‌ సిటీ ఇండెక్స్‌లో భారత్‌ తరఫున 85వ స్థానాన్ని దక్కించుకున్నది. దేశంలోని ఇతర నగరాలు న్యూఢిల్లీ (86), ముంబై (93), బెంగళూరు (95) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిజానికి కరోనా వైరస్‌ ప్రభావంతో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అన్ని నగరాల ర్యాంకులు బాగా దిగజారాయి. అయినప్పటికీ హైదరాబాదే దేశంలో ముందుండటం గమనార్హం. కాగా, ఈ జాబితాలో సింగపూర్‌ మొదటి స్థానంలో ఉండగా, హెల్సింకీ, జ్యూరిచ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కనీస సౌకర్యాలు, పరిపాలన, అవకాశాలు తదితర 15 ప్రాధాన్యతా అంశాలపై ప్రపంచవ్యాప్తంగా 109 దేశాల్లో ఈ సర్వేను ఐఎండీ, ఎస్‌యూటీడీ నిర్వహించాయి.