బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 00:00:14

హైదరాబాద్‌ అంటే ఇష్టమే

హైదరాబాద్‌ అంటే ఇష్టమే

  • బెంగళూరు తర్వాత భాగ్యనగరంపైనే టెక్కీల ఆసక్తి

ముంబై, ఏప్రిల్‌ 9: దేశీయ ఐటీ రంగంలో అత్యధిక మంది బెంగళూరులో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్‌గిగ్స్‌ తాజా సర్వేలో 40 శాతం మంది కన్నడ రాజధానికే ఓటేశారు. అయితే ఆ తర్వాతి స్థానంలో హైదరాబాదే ఉండటం గమనార్హం. మొదట్నుంచి ఐటీ రంగానికి కేంద్రంగా బెంగళూరు కొనసాగుతుండగా, మిగతా ఎన్నో నగరాలను దాటుకుని హైదరాబాద్‌ దూసుకువస్తున్నది. ఈ క్రమంలోనే బెంగళూరు తర్వాత అన్ని రకాలుగా తమ ఉన్నతికి అనుకూలమైన నగరం భాగ్యనగరమేనని టెక్కీలు అభిప్రాయపడ్డారు. పుణె మూడో స్థానంలో ఉన్నది. 


logo