సోమవారం 21 సెప్టెంబర్ 2020
Business - Aug 13, 2020 , 19:02:38

హైదరాబాద్‌ మార్కెట్లోకి ఆక్వోపాడ్‌ లాంచ్‌..గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని తయారు చేస్తుంది..

హైదరాబాద్‌ మార్కెట్లోకి ఆక్వోపాడ్‌ లాంచ్‌..గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని తయారు చేస్తుంది..

హైదరాబాద్‌: గాలి నుంచి ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన నీటిని తయారుచేసే ‘ఆక్వోపాడ్‌’ను  ఇండియాలోనే అతిపెద్ద ఏడబ్ల్యూజీ మాన్యుఫ్యాక్చరర్స్, ఆక్వో అట్మాస్పియరిక్ వాటర్ సిస్టమ్స్ ప్రైయివేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌ మార్కెట్‌లోకి గురువారం లాంచ్‌ చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి హోమ్ మోడల్ ఆక్వోపాడ్. ఈ పరికరాన్ని ఇళ్లు, ఆఫీసులు, చిన్నచిన్న వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.  ఇది రోజుకు 50 లీటర్ల స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ తయారు చేస్తుంది. ఆక్వో  అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్లు గాలిలోని అపరిశుభ్రతలను తొలగించి, యాంటీ మైక్రోబియల్ ఎయిర్ ఫిల్టర్‌తో ఏవైనా ప్రమాదకరమైన మైక్రోబులను నాశనం చేసేందుకు యు.వి. టైప్ సీ ఫిల్టరేషన్ కలిగిన శ్రేష్ఠమైన ఫిల్టర్ సిస్టమ్‌తో ఏర్పాటు చేయబడి ఉంటాయి.

ఆక్వో అట్మాస్పియరిక్ వాటర్ సిస్టమ్స్ ప్రైయివేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈవో నవకరణ్‌సింగ్‌బగ్గా మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆఫీసులు, ఇళ్లల్లో విస్తృతంగా వాడబడుతున్న బాటిల్ నీళ్ల విషయంలో భద్రత, స్వచ్ఛత గురించి జనానికి నిశ్చిత అభిప్రాయం లేదన్నారు. ఎందుకంటే ఇవి చాలా చేతులలో మారి మనకు వస్తాయని, కాబట్టి అవి కలుషితమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కాలుష్యం లేకుండా, స్వచ్ఛమైన తాగు నీటిని తయారు చేసే ఆక్వోపాడ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చామన్నారు. ఇది సింపుల్ ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో పని చేస్తుందని, ఒక గంట పనిచేసేందుకు అర యూనిట్ విద్యుత్తుని ఉపయోగించుకుంటుందన్నారు. జీఎస్టీతో సహా ఆక్వోపాడ్‌ ధర రూ. 99,000గా ఉందన్నారు.  


logo