మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 01, 2020 , 00:17:25

హెచ్‌యూఎల్‌ సబ్బులు ప్రియం

హెచ్‌యూఎల్‌ సబ్బులు ప్రియం
  • 6 శాతం వరకు పెంచబోతున్న సంస్థ

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థ హెచ్‌యూఎల్‌..సబ్బుల ధరలను 6 శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించింది. పామాయిల్‌ ధరలు మరింత ప్రియంకావడం వల్లనే అన్ని రకాల సబ్బుల ధరను 5 శాతం నుంచి 6 శాతం వరకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా హెచ్‌యూఎల్‌ సీఎఫ్‌వో శ్రీనివాస్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ..గడిచిన ఆరు నెలలుగా పామాయిల్‌ ధరలు 25 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగినప్పటికీ సబ్బుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, కానీ భవిష్యత్తులో వీటి ధరలను ఆరు శాతం వరకు సవరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ డోవ్‌, లక్స్‌, లైఫ్‌బాయ్‌, పీయర్స్‌, హమామ్‌, లిరిల్‌, రెక్సోనా బ్రాండ్లతో సబ్బులను విక్రయిస్తున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.9,953 కోట్ల విక్రయాలపై రూ.1,631 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 


logo
>>>>>>