శనివారం 06 జూన్ 2020
Business - Apr 22, 2020 , 13:37:04

కార్ల ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై భారీ త‌గ్గింపు

కార్ల ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై భారీ త‌గ్గింపు

ముంబై: లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వాహనాల సేల్స్ భారీగా పడిపోయాయి. దేశ వ్యాప్తం గానే కాకుండా ప్రపంచ వ్యాప్త౦గా ఆటో మొబైల్ రంగం కుదేలైంది. ఈ క్ర‌మంలోనే వినియోగదారులను ఎట్రాక్ట్ చేసుకునేందుకు ప‌లు కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్ల‌ను ప్రకటిస్తున్నాయి. హ్యుందాయ్, టాటా కార్ల  ఆన్‌లైన్ అమ్మకాలపై భారీ ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నాయి. టాటా మోటార్స్ కొద్ది రోజుల క్రితం క్లిక్ టు డ్రైవ్ డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్ తీసుకురావ‌డంతో పాటు.. లాక్డౌన్ మధ్య టాటా కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన ఆఫర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. 

టాటా హారియర్ బిఎస్ 6 ను గత నెలలో భారతదేశంలో లాంచ్ చేయ‌గా.. టాటా హారియర్ సేల్స్‌కి టాటా క్లిక్ టు డ్రైవ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి 30వేలరూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చ‌ని ప్ర‌క‌టించింది. టాటా టైగర్‌పై రూ. 25వేలు, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ రూ. 20వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు టాటామోటార్స్  తెలిపింది. ఇక అదే బాట‌లోహ్యుందాయ్ కూడా క్లిక్ టు బై ఫ్లాట్ ఫాం ద్వార కార్లను ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. హ్యుందాయ్ సాంట్రో కారుకు రూ.40వేల డిస్కౌంట్ ఇస్తుండ‌గా...గ్రాండ్ ఐ 10 రూ.45వేలు, ఎలైట్ ఐ20పై రూ.35వేలు త‌గ్గిస్తూ ఆఫర్ ప్రకటించింది.


logo