శనివారం 24 అక్టోబర్ 2020
Business - Sep 29, 2020 , 01:00:22

టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు

టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ రానున్న పండుగల సీజన్‌లో తమ వాహన అమ్మకాలను పెంచుకునేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నది. దీనిలో భాగంగా బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన టియాగో, టిగోర్‌, నెక్సాన్‌, హారియర్‌ లాంటి వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కార్పొరేట్‌ డిస్కౌంట్లు, కన్జ్యూమర్‌ బెనిఫిట్స్‌, ఎక్సేంజ్‌ స్కీముల రూపంలో లభ్యమయ్యే ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో లభ్యమయ్యే టియాగోపై కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.7 వేలు, కన్జ్యూమర్‌ స్కీమ్‌ కింద రూ.15 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌ కింద రూ.10 వేలు ఇవ్వనున్నట్టు టాటా మోటర్స్‌ స్పష్టం చేసింది. రూ.5.39 లక్షల ప్రారంభ ధరతో లభ్యమయ్యే టిగోర్‌పై కన్జ్యూమర్‌ స్కీమ్‌ కింద రూ.15 వేలు, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.15 వేలతోపాటు రూ.7 వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. రూ.6.99 లక్షల ప్రారంభ ధరతో లభ్యమయ్యే నెక్సాన్‌పై ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.15 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద డీజిల్‌ మోడళ్లకు రూ.10 వేలు, పెట్రోల్‌ మోడళ్లకు రూ.5 వేలు రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. అలాగే రూ.13.84 ప్రారంభ ధరతో లభించే హారియర్‌పై కన్జ్యూమర్‌ స్కీమ్‌ కింద రూ.25 వేలు, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.40 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.15 వేలు ఇవ్వనున్నట్టు టాటా మోటర్స్‌ వివరించింది.logo