e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home News Fastag to Fuel Payments |ఫాస్టాగ్‌తో పెట్రోల్ బిల్లు పేమెంట్‌.. ఐసీఐసీఐతో హెచ్పీసీఎల్ జ‌ట్టు

Fastag to Fuel Payments |ఫాస్టాగ్‌తో పెట్రోల్ బిల్లు పేమెంట్‌.. ఐసీఐసీఐతో హెచ్పీసీఎల్ జ‌ట్టు

Fastag to Fuel Payments | వాహ‌న దారుల్లారా.. మీ కారులో ఫ్యూయ‌ల్ ఐపోయింద‌ని ఆందోళ‌న చెందొద్దు.. స‌మీపంలోని పెట్రోల్ బ్యాంకులో ఫ్యూయ‌ల్, లూబ్రికెంట్ ఆయిల్‌ నింపుకుని ఫాస్టాగ్ కోడ్ ద్వారా పెట్రోల్ బిల్లు చెల్లించొచ్చు.

కేంద్ర పెట్రోలియం సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్‌) ఇందుకోసం ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకుతో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫాస్టాగ్ ద్వారా పెట్రోల్ బిల్లుల చెల్లింపుల‌ను అనుమ‌తించిన తొలిసంస్థ‌గా హెచ్పీసీఎల్ నిలిచింది.

- Advertisement -

టోల్ గేట్ల వ‌ద్ద ర‌ద్దీని త‌గ్గించ‌డంతోపాటు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. కోసం బ్యాంకుల‌తో ఫాస్టాగ్ వ్య‌వ‌స్థ ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. వివిధ కార్ల య‌జ‌మానులు కూడా త‌మ బ్యాంకు ఖాతాకు ఫాస్టాగ్‌ను అనుసంధానించుకున్నారు.

క‌నుక కార్ల య‌జ‌మానులు త‌మ ఐసీఐసీఐ ఫాస్టాగ్ కోడ్‌తో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకుల వ‌ద్ద పెట్రోల్ నింపుకోవ‌చ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్టాగ్‌ను క‌మ‌ర్షియ‌ల్ వాహ‌న‌దారులు ఫ్యూయ‌ల్‌, టోల్‌, పార్కింగ్ పేమెంట్స్‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా ఉన్న 19 వేల హెచ్పీసీఎల్ పెట్రోల్ పంపుల్లో ఈ వెసులుబాటు ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement