శనివారం 06 జూన్ 2020
Business - Apr 04, 2020 , 23:00:53

కరోనా అడ్వాన్స్ కావాలా!

కరోనా అడ్వాన్స్ కావాలా!

ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: వ్యక్తిగత ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఖాతాదారులందరికీ మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలనూ పంపుతున్నది. లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఇది నిజంగా ఊరట కలిగించే నిర్ణయం. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్‌డ్రా అవకాశం ఉంటుంది. మీ ఖాతాలోని సొమ్ములో 75 శాతం లేదా మీ మూడు నెలల బేసిక్ సాలరీ, డీఏకు సమానమైన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుని నగదు ఉపసంహరణకు అనుమతిస్తారు. ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో రూ.50వేల (ఉద్యోగి విరాళం, సంస్థ వాటా, వీటిపై వడ్డీ అంతా కలిపి) సొమ్మున్నది. మీ బేసిక్ సాలరీ, డీఏ నెలకు రూ.15వేలుగా ఉన్నది. అంటే మూడు నెలలకు రూ.45 వేలు అవుతున్నది. ఖాతా సొమ్ము రూ. 50 వేలలో 75 శా తం అంటే రూ. 37, 500. దీంతో మీరు పీఎఫ్ అడ్వాన్స్‌గా ఈ రూ. 37,500 లనే ఉపసంహరించుకోవచ్చు.

 మీకు తెలుసా?

  • పీఎఫ్ ఖాతాలో నుంచి తీసుకున్న ఈ మొత్తాన్ని మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
  • గతంలో ఏదైనా అవసరంతో నగదును ఉపసంహరించుకున్నవారూ మళ్లీ ఈ కరోనా అడ్వాన్స్ తీసుకోవచ్చు.
  • ఈ అడ్వాన్స్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఈపీఎఫ్‌వోకు సమర్పించనవసరం లేదు.
  • విత్‌డ్రా చేసుకున్న సొమ్ము ఆదాయం పన్ను పరిధిలోకి రాదు.
ఆన్‌లైన్‌లో విత్‌డ్రా విధానం
  •     https:// unifiedpo rtalmem. epfindia. gov.in/ mem berinter faceలోకి లాగిన్ కావాలి.
  •     ఆన్‌లైన్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ైక్లెయి మ్ (మీకు అవసరమైన ఫాం-31, 19, 10సి మరియు 10డీ)ను క్లిక్ చేయాలి.
  •     మీ బ్యాంక్ ఖా తా నెంబర్‌లోని చివరి 4 అంకెలను ప్రవేశపెట్టాలి. దాన్ని ధ్రువపరుచుకోవాలి.
  •     ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ ైక్లెయిమ్‌పై క్లిక్ చేయాలి.
  •     డ్రాప్ డౌన్ నుంచి పీఎఫ్ అడ్వాన్స్ (ఫాం 31)ను ఎంచుకోవాలి.
  •     డ్రాప్ డౌన్ నుంచి కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్న నగదు ఉపసంహరణ కారణాన్ని ఎంచుకోవాలి.
  •     కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. స్కాన్ చేసిన చెక్ కాపీని అప్‌లోడ్ చేయాలి. మీ చిరునామానూ ఎంటర్ చేయాలి.
  •     గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  •     మీ ఆధార్ అనుసంధాన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  •      క్లెయిమ్‌ను సమర్పించాలి.


logo