న్యూఢిల్లీ: అసలే ఇది కరోనా మహమ్మారి కాలం.. అనూహ్య ఆరోగ్య ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు మీ ఆర్థికపరమైన అవసరాలకు వ్యాక్సినేషన్ వంటిది బీమా పాలసీ.. అఫ్కోర్స్ చేతిలో కొంత సొమ్ము ఉండటం స్మార్ట్ ఆప్షన్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ప్రధాన నగరాల్లోని దవాఖానల్లో వైద్య వనరులు మొదలు మెడిసిన్స్ త్వరితగతిన అయిపోతున్న తరుణమిది.
వైద్య చికిత్సకు మీకు మనీ అవసరమైన వేళ మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్.. మీరు సమర్పించే క్లయిమ్‌ను పరిష్కరించడానికి టైం తీసుకోవచ్చు. ముందుగా మీరు దవాఖానలో డబ్బు డిపాజిట్ చేస్తేనే సంస్థ యాజమాన్యం చికిత్స ప్రారంభిస్తుంది. బీమా పాలసీల్లో కొన్ని కొవిడ్-19 అనుబంధ చార్జీలు కవర్ చేయడం లేదు.
అన్ని ఆరోగ్య పాలసీలకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఆరోగ్య సమస్యలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్‌లో ప్రీ ఎగ్జిస్టింగ్ కండీషన్లు కవర్ కావు.
బిల్లింగ్, ఓవర్‌చార్జింగ్ అంశాలపై ఇన్సూరెన్స్ సంస్థలు, దవాఖానలకు మధ్య వివాదాలు నెలకొన్న విషయాలు నియంత్రణ సంస్థల నోటీసులోకి వచ్చాయి. కొవిడ్-19 చికిత్సపై బీమా సంస్థలు 50 శాతం క్లెయిమ్‌లు మాత్రమే ఆమోదించడం గమనార్హం.
ఉదాహరణకు కొవిడ్-19 చికిత్సలో కీలకమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లకు కవరేజీ లభించదని తొలుత నిబంధనల్లో చేర్చినా తర్వాత అనుమతించారు. అయితే దవాఖాన బిల్లుల్లో ప్రీ-డిఫైన్డ్ కంటే ఎక్కువగా పీపీఐ కిట్లు వాడినట్లు బిల్లు చూపడమే వివాదానికి కారణం అవుతున్నది.
జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఒక్కోరోజుకు పీపీఐ ఖర్చు కింద రూ.1200-2000 చెల్లించాలని నిర్ణయించింది. పలు ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఒక్కో కిట్‌కు రూ.1500-2000 చెల్లిస్తూ వస్తున్నాయి.
ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో మీ వద్ద అందుబాటులో ఉన్న క్యాష్‌ను బట్టి నాణ్యమైన హెల్త్‌కేర్ లభిస్తుంది. అనిశ్చిత ఆరోగ్య పరిస్థితుల్లో సజావుగా ద్రవ్య లభ్యత సమస్య పరిష్కరించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.
క్రెడిట్ కార్డు ద్వారా హాస్పిటల్ బిల్స్ చెల్లించొచ్చు. అయితే వడ్డీరేటు 30-49 శాతం వరకు ఉంటుంది. అదే సమయంలో భారం తగ్గించుకోవడానికి ఆ మొత్తాన్ని సమాన రుణ వాయిదాలుగా మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డుపై కంటే పర్సనల్ లోన్ తీసుకోవడం మెరుగైన చర్య. మీకు ఖాతా ఉన్న బ్యాంకులోనే ఇటువంటి రుణాలు తేలిగ్గా లభిస్తాయి. మీ బ్యాంకు శాఖలో ప్రీ-అప్రూవ్డ్ పరిమితి మేరకు రుణం మంజూరవుతుంది.
బ్యాంకు యాజమాన్యం తో ఖాతాదారుగా మీకు ఉన్న సంబంధం కూడా తేలిగ్గా రుణం మంజూరు కావడానికి కారణం అవుతుంది. మీ అవసరాలకు అనుగుణంగా రుణం మంజూరవుతుంది. క్రెడిట్ కార్డు రుణంతో పోలిస్తే పర్సనల్ లోన్ మీద వడ్డీరేటు 9-16 శాతం మధ్య ఉంటుంది.
బంగారంపై రుణాలు దరఖాస్తు సమర్పించిన కొన్ని గంటల్లోనే మంజూరవుతాయి. దీనికి సెక్యూరిటీగా బంగారం తాకట్టు పెడతారు. క్రెడిట్ కార్డు హిస్టరీ పేలవంగా ఉన్నా.. తక్కువ వడ్డీరేటుకే బంగారం రుణం మంజూరవుతుంది. ఈ రుణంపై వడ్డీరేటు 7-29 శాతం మధ్య ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ షేర్లు, ఇన్సూరెన్స్ పాలసీల వంటి సెక్యూరిటీలకు వ్యతిరేకంగా రుణాలు తీసుకోవచ్చు. పర్సనల్ రుణాలపై కంటే తక్కువ వడ్డీరేటు. ఇన్పూరెన్స్ పాలసీ సరెండర్ విలువలో 60-90, ఫిక్స్డ్ డిపాజిట్ల విలువలో 80-95 శాతం, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ల విలువలో 50-60 శాతం వరకు రుణాలిస్తాయి.
పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్‌కు చోటా రాజన్ తరలింపు
తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మెగాస్టార్
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
మహారాజా కోసం స్పైస్ జెట్ కూడా.. ఫైనాన్సియల్ బిడ్ గడువు పొడిగించాలంటూ..!