శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 00:38:41

కారు కొంటున్నారా?

కారు కొంటున్నారా?

  • ఓన్‌ డ్యామేజీ పాలసీ గురించి తెలుసుకోండి

వ్యక్తులకైనా.. స్థిర,చరాస్తులకైనా బీమా ఉంటేనే ధీమా. ముఖ్యంగా వాహన రంగంలో బీమాకున్న ప్రాధాన్యత అంతా.. ఇంతా కాదు.  వచ్చే నెల 1 తర్వాత కారు కొంటే ఓన్‌ డ్యామేజీ బీమా కొనుగోలుకు రెండు రకాల పద్ధతులు ఉండనున్నాయి. ఒకటి బండిల్డ్‌ పాలసీ. ఇందులో దీర్ఘకాలిక థర్డ్‌ పార్టీ పాలసీ, ఏడాది ఓన్‌ డ్యామేజీ పాలసీ ఉంటాయి. రెండోది రెండు వేర్వేరు పాలసీలు. మొదటిసారి బోనస్‌ను క్లయిమ్‌ చేసుకోకపోతే ఓన్‌ డ్యామేజీ పాలసీ రెన్యువల్‌ సమయంలో దాన్ని రాయితీ రూపంలో పొందే వీలుంటుంది. ఇక ఫోర్‌-వీలర్లకు మూడేండ్లు, టూ-వీలర్లకు ఐదేండ్లు థర్డ్‌ పార్టీ బీమాలను కొనాల్సిందే. ప్రీమియంలు అంతటా ఒకేలా ఉంటాయి. కవరేజీ కూడా ఒకేలా ఉంటుంది. 


logo