గురువారం 28 జనవరి 2021
Business - Dec 02, 2020 , 12:28:30

ఆర్టీజీఎస్ చేస్తే ఎంత మొత్తానికి ఎంత చార్జ్...

  ఆర్టీజీఎస్ చేస్తే ఎంత మొత్తానికి ఎంత చార్జ్...

ఢిల్లీ: రూ.2 లక్షలకు మించి నగదు బదలీ చేసేందుకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్) 24గంటల సేవలు (అంటే డిసెంబర్ 1వతేదీ)నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించేందుకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ మీద ఆర్బీఐ విధించే ఛార్జీలను గత ఏడాది జూలై నుండి రద్దు చేసింది. ఆర్టీజీఎస్ 24X7 అందుబాటులో ఉండటం రోజువారీ ట్రాన్సాక్షన్స్ చేసే వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరం. పెద్ద మొత్తంలో తక్షణమే బదలీ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా కనీస బదలీ రూ.2 లక్షలు కాగా, గరిష్ట పరిమితి లేదు. ఇప్పటి వరకు ఆర్టీజీఎస్ వల్ల ఉన్న ఇబ్బంది ఏమంటే కేవలం పని దినాల్లో, నిర్ణీత సమయంలో మాత్రమే ఉండటం. ఇప్పుడు రౌండ్ ది క్లాక్ పని చేయనుంది. అయితే ఆర్టీజీఎస్ చేస్తే ఎంత మొత్తానికి ఎంత చార్జ్...అవుతుందో తెలుసుకుందాం... 

 ఎంత చార్జ్...

-మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచీని విజిట్ చేయడం ద్వారా ఆర్టీజీఎస్‌ను ఉపయోగించి మనీ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. 

-ఆర్టీజీఎస్ ట్రాన్సుఫర్ పై  విధించే ఛార్జీలను ఆర్బీఐ రద్దు చేసినప్పటికీ, ఆయా బ్యాంకులు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తాయి. 

-రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫండ్ ట్రాన్సుఫర్ పై బ్యాంకులు గరిష్టంగా రూ.24.50 వసూలు చేస్తాయి. 

-రూ.5 లక్షలకు మించి ఫండ్ ట్రాన్సుఫర్ చేస్తే బ్యాంకులు గరిష్టంగా రూ.49.90 ఛార్జ్ చేస్తాయి.

-ఆర్టీజీఎస్ ద్వారా ఫండ్ ట్రాన్సుఫర్ కోరుతూ నిధులు బదలీ చేయమని బ్యాంకు సూచనలు అందుకుంటుంది. దీంతో వెంటనే ఫండ్ ట్రాన్సుఫర్ అవుతుంది. రూ.2 లక్షలకు మించి ట్రాన్సుఫర్ కోసం ఆర్టీజీఎస్ కాగా, రూ.2 లక్షల లోపు నగదు బదలీకి నెఫ్ట్‌ను ఉపయోగిస్తారు. ఇప్పటికే ఇది రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంది. ఆర్టీజీఎస్ కేసులో ప్రతి ట్రాన్సాక్షన్ ఇండివిడ్యువల్‌గా పరిష్కరించబడుతుంది. నెఫ్ట్‌ను సాధారణంగా ఇండివిడ్యువల్స్ ఉపయోగస్తారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo