శనివారం 04 జూలై 2020
Business - Jul 01, 2020 , 00:48:27

నేడు జీఎస్టీ డే

నేడు జీఎస్టీ డే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి బుధవారంతో మూడేండ్లు పూర్తవుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని ప్రారంభించింది. దీంతో బుధవారం మూడో జీఎస్టీ డే వేడుకలను నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌ సెంట్రల్‌ జీఎస్టీ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్యా తెలిపారు. ఇందులో భాగంగా జోన్‌ పరిధిలో ఉత్తమ సేవలందించిన 10 మంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందించనున్నట్టు చెప్పారు. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో వేడుకలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు.


logo