శనివారం 08 ఆగస్టు 2020
Business - Jul 28, 2020 , 07:06:39

ఐటీ చెల్లించిన శతాధిక వృద్ధురాళ్లకు సన్మానం

ఐటీ చెల్లించిన శతాధిక వృద్ధురాళ్లకు సన్మానం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజాబాయి తివారీ (117)తో సహా మరో ముగ్గురు శతాధిక మహిళలను ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సోమవారం సన్మానించారు. ఐటీ 160వ వార్షికోత్సవం సందర్భంగా వారిని సన్మానించినట్లు అధికారులు తెలిపారు. 1903లో జన్మించిన గిరిజాబాయి తివారీ తనకు వడ్డీలు, పెన్షన్‌ రూపేణా వచ్చే ఆదాయానికి క్రమం తప్పకుండా ఆదాయం పన్ను చెల్లిస్తుంటారు. ఆమె ఇతరులకు ఉదాహరణగా నిలిచారని మధ్యప్రదేశ్‌ అండ్‌ ఛత్తీస్‌గఢ్‌ ఐటీ శాఖ చీఫ్‌ కమిషనర్‌ ఏకే చౌహాన్‌ తెలిపారు. ఇండోర్‌కు చెందిన ఈశ్వరీబాయి లుల్లా (103), కాంచన్‌బాయి (100), బిలాస్‌పూర్‌ నివాసి బీనా రక్షిత్‌ (100)లను కూడా సన్మానించారు.


logo