సోమవారం 01 మార్చి 2021
Business - Dec 23, 2020 , 16:31:18

90 ల‌క్ష‌లు దాటిన హోండా షైన్ అమ్మ‌కాలు

90 ల‌క్ష‌లు దాటిన హోండా షైన్ అమ్మ‌కాలు

న్యూఢిల్లీ : ప‌్ర‌ముఖ వాహ‌న కంపెనీ హోండా.. షైన్ బైక్‌ల అమ్మ‌కాల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేసింది. ఇండియాలో 2006లో షైన్ బైక్‌ల త‌యారీని తిరిగి ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 90 ల‌క్ష‌ల‌కు పైగా బైక్‌లు అమ్ముడుపోయాయ‌ని వెల్ల‌డించింది. 2020లోనూ ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌కు మంచి డిమాండ్ ఉంటుంద‌ని పేర్కొంది. కంపెనీ ప్రారంభం నుంచి 54 నెల‌ల కాలంలో 10 ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌కు ద‌గ్గ‌రైన‌ట్లు ప్ర‌క‌టించింది. 2013 నాటికి ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు 125 సీసీ మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలిపింది. 2014 నాటికి షైన్ కొనుగోలుదార్ల సంఖ్య 30 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని పేర్కొంది. 2018 నాటికి ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రు 125 సీసీ బైక్‌ను కొన్న‌ట్లు తెలిపింది. తాజా షైన్ బైక్‌లు 125cc PGM-FI HET ఇంజిన్‌ను క‌లిగి ఉండి, బీఎస్ 6 ఉద్గార ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. 

VIDEOS

logo